Sunday, March 1, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్ క‌నుస‌న్న‌ల్లో ఆప‌రేష‌న్..ఫోటోలు విడుద‌ల చేసిన వైట్ హౌస్‌

ట్రంప్ క‌నుస‌న్న‌ల్లో ఆప‌రేష‌న్..ఫోటోలు విడుద‌ల చేసిన వైట్ హౌస్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇరాన్‌పై అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’ని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా పర్యవేక్షించారు. సాధారణంగా హైవేల్యూ టార్గెట్లపై జరిగే దాడులే అమెరికా అధ్యక్షుడి కనుసన్నల్లో జరుగుతాయి. తాజాగా ట్రంప్‌ పర్యవేక్షణకు సంబంధించిన చిత్రాలను శ్వేతసౌధం విడుదల చేసింది. ఫ్లొరిడాలోని పామ్‌బీచ్‌లోని ట్రంప్‌ స్వగృహం మార్‌ ఎ లాగో రిసార్ట్‌లోని ఆయన రివ్యూ చేస్తుండగా తీసిన ఫొటో ఇది.

ట్రంప్‌తో పాటు విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఆర్మీ కీలక జనరల్స్‌ సుసీ విల్లీస్‌, డాన్‌ కెయిన్‌ తదితరులు కూడా అక్కడే ఉన్నారు. మరోవైపు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కూడా వార్‌ రూమ్‌లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్న చిత్రాన్ని శ్వేతసౌధం పోస్టు చేసింది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు సౌదీ, ఇజ్రాయెల్‌ సహా ఇతర గల్ఫ్‌ నేతలతో కూడా టచ్‌లో ఉన్నట్లు వెల్లడించింది. అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’తోపాటే.. ఇజ్రాయెల్‌ కూడా ‘ఆపరేషన్‌ రోర్‌ ఆఫ్‌ ది లయన్‌’ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ కన్ను మూసిన విషయాన్ని టెహ్రాన్‌ ఇప్పటికే ధ్రువీకరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -