Sunday, March 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హాస కొత్తూర్ లో ఉచిత కంటి వైద్య శిబిరం

హాస కొత్తూర్ లో ఉచిత కంటి వైద్య శిబిరం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని హాస కొత్తూర్ లో ఆదివారం సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి పర్యవేక్షణలో లయన్స్ క్లబ్ కమ్మర్ పల్లి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి అధ్యక్షులు లుక్క గంగాధర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. లయన్స్ క్లబ్ బోధన్ చారిటబుల్ ట్రస్ట్ కు చెందిన మొబైల్ ఐ స్క్రీనింగ్ వ్యాన్ లో ఉచిత కంటి వైద్య శిబిరానికి హాజరైన వారికి వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు.

ఇందులో 22 మందికి మోతి బిందు ఆపరేషన్లు అవసరమని గుర్తించారు. వీరికి ఉచిత కంటి ఆపరేషన్ లు గురువారం చేయించడం జరుగుతుందని లయన్స్ క్లబ్ కమ్మర్ పల్లి అధ్యక్షులు లుక్క గంగాధర్ తెలిపారు. అనంతరం శిబిరంలో పాల్గొన్న లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ కంటి ఆస్పత్రి వైద్యులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి ట్రెజరర్ తెడ్డు రమేష్, జోన్ చైర్మన్ చేరుకు పృథ్వీరాజ్, లయన్స్ క్లబ్ సభ్యులు, తదితరులుు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -