- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
జన్నారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆదివారం ఎస్సీ వర్గీకరణ కోసం అసువులు బాసిన మాదిగ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కొండూరి ప్రభుదాస్ మాట్లాడుతూ.. ఎందరో మహానుభావులు అసువులు బాసిన తర్వాతనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైంది అన్నారు. ఎస్సీ వర్గీకరణతో మాదిగ సోదరులకు ఎంతో లాభం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జంగం రవి మాదిగ, కోశాధికారి మంద రాజేష్ మాదిగ, జిల్లా నాయకులు మామిడిపల్లి ఇందయ్య మాదిగ, దుమ్మల రమేష్ మాదిగ, దుమ్మాల ప్రవీణ్ మాదిగ, కొండుకూరి ప్రశాంత్ మాదిగ, కుడుకల రాజేందర్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



