- – 118 మంది విద్యార్థులు 90 శాతం కంటే ఎక్కువ స్కోర్
నవతెలంగాణ హైదరాబాద్: JEE మెయిన్ 2026 సెషన్ 1లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు.18 మంది వేదాంతు విద్యార్థులు 90 శాతం కంటే ఎక్కువ స్కోర్ చేయడంతో, ఈ ప్రాంతంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ నుండి అత్యధికంగా సాధించిన వారిలో సాహిల్ బి ప్రథమస్థానంలో ఉన్నాడు. అతను 99.72 శాతం సాధించాడు. భాస్కరభట్ల సాయి ఆదిత్య 99.51 శాతం, డిఎం అశ్వత్ 99.34 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ ముగ్గురు ఈ ప్రాంతం నుండి అధిక స్కోరర్ల జాబితాలో ఉన్నారు.
మొత్తం మీద, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ నుండి ముగ్గురు వేదాంతు విద్యార్థులు 99.5 శాతం కంటే ఎక్కువ స్కోర్ చేశారు. 10 మంది విద్యార్ధులు 99 శాతం మార్కును దాటారు. దీనిద్వారా టాప్ పర్సంటైల్ బ్రాకెట్లలో స్థిరమైన పనితీరును వేదాంతు ప్రతిబింబిస్తుందని మరోసారి నిరూపితం అయ్యింది.
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో విద్యా రంగంలో వస్తోన్న అభివృద్ధి , మార్పునకు సంకేతం
వేదాంతు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ అంతటా 17 లెర్నింగ్ సెంటర్స్ ను నిర్వహిస్తోంది. ఈ కేంద్రాలు ఇప్పుడు సెకండ్ ఫుల్ అకడమిక్ సైకిల్ లో ఉన్నాయి. గతేడాది కూడా జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో వేదాంతు విద్యార్ధులు అధిక సంఖ్యలో సత్తా చాటారు. ఈ కేంద్రాలకు మరింత శక్తినిచ్చేలా ఇక్కడ వేద్ అనే ఏఐ టూల్ ని ఉపయోగిస్తున్నారు. దీనిద్వారా ప్రతి తరగతి గదిలో ప్రతి విద్యార్థి యెక్క సామర్ధ్యాన్ని వ్యక్తిగతంగా పరీక్షించడం, అతడు ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు లాంటి విషయాల్ని చాలా సులభంగా కనుక్కునే అవకాశం ఉంటుంది. స్మార్ట్ క్లిక్కర్ల ద్వారా, తరగతిలో విద్యార్థుల రెస్పాన్స్ లు రియల్ టైమ్ లో ట్రాక్ చేస్తారు. తద్వారా ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క లోటుపాటుల్ని తక్షణమే గుర్తించగలుగుతారు. క్లాస్ రూమ్ సమయం కాకండా, విద్యార్థులు పర్సనల్ విద్యా మార్గదర్శకత్వం కోసం వేద్ AIని ఉపయోగించుకోవచ్చు. ప్రశ్నను టైప్ చేయడం లేదా అప్లోడ్ చేయడం ద్వారా 24×7 సందేహ నివృత్తి కోసం ఇన్స్టాసోల్వ్ ను ఉపయోగిస్తారు. ప్రశ్న మరింత బాగా అర్థం కావడం కోసం సిస్టమ్ ఫోకస్ చేసిన వీడియోలు, గమనికలు , క్విజ్‌లను సిఫార్సు చేస్తుంది.
JEE మెయిన్ సెషన్ 1లో మా విద్యార్థులు ఈ స్థాయిలో ప్రదర్శన ఇవ్వడం మాకు ఎంతో ఆనందాన్ని స్ఫూర్తిని అందించిందని అన్నారు వేదాంతు సహ వ్యవస్థాపకుడు & విద్యావేత్తల అధిపతి ఆనంద్ ప్రకాష్. “ప్రతి విద్యార్థికి వచ్చిన శాతం వెనుక పట్టుదల , కఠోర క్రమశిక్షణ కథనం ఉంటుంది. ఈ ఫలితాలు మా సమగ్ర సాంకేతిక నమూనా, బోధనా నైపుణ్యం , వ్యక్తిగతీకరించిన విద్యా మద్దతు యొక్క బలాన్ని ప్రతిబింబిస్తాయి.” అని అన్నారు.
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు , ఉపాధ్యాయులను అభినందిస్తూ, వేదాంతు సహ వ్యవస్థాపకుడు & CEO వంశీ కృష్ణ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ… “ఈ ఫలితాలు ఎన్నో ఏళ్లుగా మేం నమ్మిన విశ్వాసాన్ని, సరైన మార్గదర్శకత్వం ద్వారా అన్‌లాక్ చేయబడిన సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఆంధ్రప్రదేశ్,తెలంగాణ అంతటా 17 లెర్నింగ్ సెంటర్స్ విజయాలతో మేం విస్తరణ ప్రణాళికలు కూడా రచిస్తున్నాము. తద్వారా ఈ ప్రాంతంలో,భారతదేశం అంతటా పర్సనలైజ్డ్ లెర్నింగ్ అందించేందుకు మేం సిద్ధంగా ఉన్నామని అన్నారు.



