- Advertisement -
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ ఉత్సవాల్లో భాగంగా మండలంలోని కొయ్యుర్లో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొయ్యూరులోని శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలవేసి,కేక్ కట్ చేయడం జరుగుతుందని కావున మండలంలోని అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ నాయకులు,మహిళ నాయకురాళ్లు,యూత్ నాయకులు,కార్యకర్తలు,దుద్దిళ్ల కుటుంబం అభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
- Advertisement -



