నవతెలంగాణ-కమ్మర్ పల్లి
గ్రామ పంచాయతీ కార్మికుల మూడు నెలల బకాయిలను వెంటనే విడుదల చేయాలని సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజా పంథా మండల కార్యదర్శి బషీరి అశోక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజా పంథా మండల కార్యదర్శి బషీరి అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
కార్మికులకు మూడు నెలల నుండి జీతాలు రావడం లేదని, ఇలాగైతే ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మూడు నెలల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టియుసిఐ జిల్లా ఉపాధ్యక్షురాలు సత్తెక్క, ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి రాజేందర్, కోశాధికారి పోషన్న, ఉపాధ్యక్షులు మౌలానా, స్వామి, సహాయ కార్యదర్శి శ్రీనివాస్, గ్రామ పంచాయతీ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.



