ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు తుళ్ల వెంకన్న
నవతెలంగాణ – నెల్లికుదురు
మాదిగ ఉద్యమంలో అమరుల వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు తుళ్ల వెంకన్న అన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో అమరుల చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ ఆవిర్భావం నాటి నుంచి ఇప్పటివరకు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో కొనసాగిన ఉద్యమము ఉద్యమం సాధించిన ఫలితాలను గుర్తు చేశారు.
ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి ఆశయాలను కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. కార్యక్రమంలో నాయకులు హెచ్ అశోక్ మాదిగ , హెచ్ రవి మాదిగ , హెచ్ మహేందర్ మాదిగ, తుళ్ల వివేక్ మాదిగ ,దండంపెల్లి వెంకట సాయిలు మాదిగ, దండంపెల్లి సోమయ్య మాదిగ, శి వర్ల కొమురయ్య, చెడుపాక వెంకన్న మాదిగ, ఏర్పుల సరేష్ మాదిగ, దండంపెళ్లి కొమురయ్య మాదిగ, వేణు మాదిగ ,తదితరులు పాల్గొన్నారు.



