- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పెళ్లి జరిగిన నాలుగు రోజులకే ఓ యువకుడు ఆత్మహత్యకి పాల్పడ్డ ఘటన చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం జోగిండ్లులో జరిగింది. జె.మురళి (30) అనే యువకుడు స్థానిక CSE కేంద్రంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. గతంలో తన మొదటి భార్యతో విడాకులు పొందిన మురళి, ఫిబ్రవరి 25న ఇచ్చాపురానికి చెందిన సుజాతను పెళ్లి చేసుకున్నాడు. 28న ఉదయం పని కోసం ఇంటి నుంచి వెళ్లిన మురళి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల గాలించగా, పెద్ద చెరువులో మృతదేహం లభ్యమైంది.
- Advertisement -



