- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ పరిస్థితి తీవ్రమైంది. ఇరాన్ దాడుల్లో అమెరికాకు చెందిన ముగ్గురు సైనికులు మరణించగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఎక్కడ చనిపోయారనే విషయాన్ని మాత్రం అమెరికా వెల్లడించలేదు. ఇప్పటికే అమెరికా యుద్ధనౌకలు, ఆర్మీ బేస్‌లపై ఇరాన్ మిసైల్ దాడులు కొనసాగుతున్నాయి. కాగా, సైనికుల మృతికి ప్రతీకారం తప్పదని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా దాడుల్లో ఇరాన్‌లో 201 మంది మృతి చెందగా, 750 మందికి గాయపడ్డారు. ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 10 మంది చనిపోగా, 120 మందికి గాయాలయ్యాయని సమాచారం.
- Advertisement -



