Monday, March 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకాంగ్రెస్‌ పీఏసీ సమావేశం.. పాల్గొన్న రాహుల్‌గాంధీ

కాంగ్రెస్‌ పీఏసీ సమావేశం.. పాల్గొన్న రాహుల్‌గాంధీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్ : అనంతగిరి హిల్స్‌లో పీఏసీ సమావేశం ప్రారంభమైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేసీ వేణుగోపాల్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, తెలంగాణ, ఏపీ పీసీసీ చీఫ్‌లు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, షర్మిలతో పాటు ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ బలోపేతానికి ప్రణాళికబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై నేతలతో రాహుల్ గాంధీ చర్చించారు. గత 9 రోజులుగా ఏపీ, తెలంగాణ జిల్లా డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం అక్కడ కొనసాగుతోంది. నేడు జరిగే ముగింపు సమావేశంలో రాహుల్ గాంధీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -