- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. దానం, కడియంలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, పాడి కౌశిక్ రెడ్డి అనర్హత పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే తాము పార్టీ మారలేదని వీరు స్పీకర్‌కు రిప్లై ఇచ్చారు. అయితే తగిన ఆధారాలతో విచారణకు రావాలని స్పీకర్ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ఈ నెల 4న వీరిని విచారణ చేయనున్నారు.
- Advertisement -



