నవతెలంగాణ-హైదరాబాద్: టీమిండియా రాబోయే అంతర్జాతీయ మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. జూన్ నెలలో ఆఫ్ఘనిస్తాన్ భారత్‌లో పర్యటించి ఒక టెస్టు మూడు వన్డే మ్యాచ్‌లను ఆడనుందని తెలిపింది.
ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో ఆడుతోంది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన భారత్, సూపర్-8 దశలో జింబాబ్వే, వెస్టిండీస్ జట్లపై విజయం సాధించి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్లో మార్చి 5 న ఇంగ్లాండ్‌తో భారత్ తలపడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే మార్చి 8న ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది.టోర్నమెంట్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు ఐపీఎల్ 2026 సీజన్‌లో పాల్గొంటారు. ఆ తర్వాత జూన్‌లో మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్‌లలో బరిలోకి దిగనున్నారు.
భారత్ – ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ వివరాలు ….
జూన్ 6 -10 : టెస్టు మ్యాచ్ – New Chandigarh (ఉదయం 9:30)
జూన్ 14 : మొదటి వన్డే – Dharamshala
జూన్ 17 : రెండో వన్డే – Lucknow
జూన్ 20 : మూడో వన్డే – Chennai
(వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయి)



