మారమ్మత్తుల పేరుతొ విధ్యుత్ నిలిపి వేసి కాలయాపన చేస్తున్న అధికారులు
ప్రశ్నిస్తే తప్ప పలకని అధికారులు
నవతెలంగాణ – దర్పల్లి
మరమ్మత్తుల పేరుతో మండల కేంద్రలో విద్యుత్ అధికారులు ఇష్టారాజ్యంగా కరెంటు సరఫరా నిలిపివేస్తున్నారు. గ్రామంలోని ఓ వాట్యాప్ గ్రూప్ లో మెసేజ్ పాస్ చేసి విద్యుత్ నిలిపివేశారు. అసలే ఎండాకాలం కావడంతో ఫ్యాన్ లు తిరగకపోవడంతో ఇండ్లల్లో ఉండే మహిళలు, చిన్నరులు, వయస్సు మళ్లిన వారు ఉక్కపోతతో తంటాలు పడుతున్నారు. గ్రామస్థులు ఉదయం 10:30 గంటలకు మరమ్మత్లు పేరుతో కరెంటును నిలిపివేసి, మధ్యాహ్నమైనా విద్యుత్ ను సరఫరా చేయడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై నవతెలంగాణ ప్రతినిధి స్థానిక ఏఈని వివరణ కోరగా.. గ్రామంలో 15 ట్రాన్స్ ఫార్మర్లు ఉన్నాయని, ప్రతి ట్రాన్స్ఫర్మార్ కు గైడ్ సెట్ లు ఏర్పాటు చేస్తున్నామని ఈయన చెప్పారు. వేసవిలో ఇబ్బందులు తలెత్తకుండా వీటిని బిగిస్తున్నాని సమాధానం ఇచ్చారు. ఉన్న 15 ట్రాన్స్ ఫార్మర్లలో ఎక్కడ మరమ్మత్తులు అవసరమో అక్కడ మాత్రమే నిలిపివేసి, మిగతా చోట్ల విద్యుత్ విడుదల చేస్తే బాగుంటుందని విలేకరి ప్రశ్నించగా.. అందుకు ఆయన సానుకూలంగా స్పందించి, సుమారు 2:30 కు విధ్యుత్ సరఫరా చేశారు. పై అధికారులు బాగానే ఉన్నప్పటికీ కిందిస్థాయి ఉద్యోగులు నిర్లక్ష్యం తగదని ఆయన అన్నారు. ఇప్పటికైనా సమస్య ఉన్నచోట విధ్యుత్ నిలిపివేసి సకాలంలో పనులు పూర్తి చెయ్యాలని అధికారులను స్థానిక ప్రజానీకం కోరుతోంది.



