Tuesday, March 3, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనౌకలపై దాడి..ముగ్గురు భారతీయులు మృతి

నౌకలపై దాడి..ముగ్గురు భారతీయులు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పశ్చిమాసియా ఘర్షణల్లో ఇప్పటివరకు భారతదేశానికి చెందిన ముగ్గురు నావికులు మృతి చెందినట్లు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ షిప్పింగ్‌ వెల్లడించింది. ఒమన్‌ తీర ప్రాంతాల్లో ఉన్న పలు వాణిజ్య నౌకలపై ఇరాన్‌ చేసిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో షిప్‌ ఆపరేటర్లకు అడ్వైజరీ జారీ చేసింది. గల్ఫ్ ఆఫ్‌ ఒమన్‌, హోర్ముజ్‌ జలసంధి, పర్షియన్ గల్ఫ్‌లో పరిస్థితులను గమనిస్తున్నామని పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో క్షిపణి, డ్రోన్ కార్యకలాపాలకు సమస్యలు ఉన్నట్లు గుర్తించామని తెలిపింది. షిప్‌ ఆపరేటర్ల భద్రతను కచ్చితంగా దృష్టిలోఉంచుకోవాలని.. అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే రిపోర్టు చేయాలని సూచించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -