నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయిల్, యూఎస్ వైమానిక దాడులతో పశ్చిమాసియాలో దారుణం చోటుచేసుకుంది. రెండు దేశాల క్షిపణులు.. ఇరాన్‌లోని హోర్మోజ్గాన్ ప్రావిన్స్‌లోని మినాబ్ గర్ల్స్ ప్రైమరీ స్కూల్‌పై పెను విధ్వంసం సృష్టించాయి. ఈ దాడిలో దాదాపు 150మందిపైగా అమ్మాయిలు మృతి చెందినట్లు ఆ దేశ మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. ఈ దుర్ఘటనను నిరసిస్తూ ఆ దేశవాసులు వేల సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొన్ని..ఇజ్రాయిల్-అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని పేర్కొన్నాయి. .
మినాబ్ ఎలిమెంటరీ స్కూల్‌పై అమెరికా, ఇజ్రాయెల్ ప్రభుత్వం జరిపిన ఉగ్రవాద దాడిలో అమరవీరుల అంత్యక్రియల ఊరేగింపులో వేల మంది పాల్గొన్నారని ఆ దేశ టీవీ చానల్ ప్రెస్ టీవీ ఎక్స్‌లో పోస్టు చేసింది.
UN వార్తల ప్రకారం.. ఇరాన్‌లోని హోర్మోజ్గాన్ ప్రావిన్స్‌లోని మినాబ్ గర్ల్స్ ప్రైమరీ స్కూల్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు జరిగిన తర్వాత మరణించిన వారి సంఖ్య ఇప్పుడు 150కి చేరుకుంది. ఈ ఘటనలో దాదాపు 100 మంది గాయపడ్డారు.ఈ దుర్ఘటనపై UNESCO తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. “విద్యా సంస్థలపై దాడులు విద్యార్థులు, ఉపాధ్యాయులను ప్రమాదంలో పడేస్తాయని, విద్యా హక్కును దెబ్బతీస్తున్నాయని” పేర్కొంది.



