Tuesday, March 3, 2026
E-PAPER
HomeఆటలుT20 WORLD CUP: రేపే తొలి సెమీస్ స‌మ‌రం

T20 WORLD CUP: రేపే తొలి సెమీస్ స‌మ‌రం

- Advertisement -
  • ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా సౌతాఫ్రికా వ‌ర్సెస్ కివీస్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఫైన‌ల్ బెర్తు కోసం అసలు ఘ‌ట్టం రేపు ప్రారంభం కానుంది. తొలి సెమీస్ పోరులో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ల మ‌ధ్య ఫైన‌ల్ బెర్తు కోసం అమీతుమీ తెల్చుకోనున్నాయి. రెండో సెమీ పోరులో భాగంగా మార్చి 5న‌ ఇంగ్లాండ్, ఇండియా టీంలు త‌ల‌ప‌డ‌నున్నాయి. మెగా టోర్నీలో గ్రూప్ ద‌శ మ్యాచ్‌లు, సూప‌ర్‌-8 విజ‌య‌వంతంగా ముగిసిన విష‌యం తెలిసిందే. ఇక టైటిల్ కోసం నాలుగు జ‌ట్లు ఢీకొని రెండు టీంలు ఫైన‌ల్ పోరులో తెల్చుకోనున్నాయి.

మొద‌టి సెమీ పోరులో భాగంగా సౌతాఫ్రికా వ‌ర్సెస్ న్యూజిలాండ్ మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. అయితే ప్ర‌స్తుత టోర్నీ ప‌రంగా ఇరు జ‌ట్ల బ‌లబ‌లాలు ప‌రంగా చూస్తే..స‌ఫారీలు అన్ని విధాలుగా ముందు ఉన్నారు అనేదాంట్లో ఎలాంటి సందేహాం లేదు. గ్రూప్ ద‌శ‌లోని ప‌లు మ్యాచ్‌ల్లో త‌డ‌బ‌డినా..సూప‌ర్-8లో ఎలాంటి పొర‌పాట్లు చేయ‌కుండా గ్రూప్‌-ఏలో ఆడినా ప్ర‌తి మ్యాచ్‌లోనూ అద్భుత విజ‌యాలు సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌, ఫిల్డిండ్ ల‌తో పాటు త‌దిత‌ర అంశాల‌పై జ‌ట్టు స‌భ్యులు స‌మిష్టిగా రాణించి టైటిల్ కైవ‌సం చేసుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. కొస‌మెరుపు ఎంటంటే కివీస్, స‌ఫారీలు లీగ్ ద‌శ‌లో గ్రూప్-డిలో త‌ల‌ప‌డ‌గా సౌతాఫ్రికా జ‌ట్టు విజ‌యం సాధించింది.

న్యూజిలాండ్ కూడా లీగ్ మ్యాచ్‌ల‌తో పాటు సూప‌ర్‌-8లోను అద్భుతంగా రాణించింది. సూప‌ర్‌-8లో భాగంగా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన కీల‌క మ్యాచ్‌లో ఓడిపోయింది. కానీ శ్రీ‌లంక‌పై పాక్ గెలిచినా..ర‌న్ రేట్ పాకిస్థాన్ టీం క‌న్నా ఉత్త‌మంగా ఉండ‌టంతో ల‌క్కీగా తొలి సెమీస్ కు అర్హ‌త సాధించింది. కివీస్ కూడా అన్ని విధాలుగా స‌న్న‌ద్ధంగా ఉంది. కాక‌పోతే లీగ్ ద‌శ‌లో ఒకే గ్రూప్ ద‌శ‌లో ఒక్క‌సారిగా ఇరు జ‌ట్లు త‌ల‌ప‌డ‌గా కివీస్ ఓడిపోయింది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు స‌ఫారీల‌ను ఢీకొట్టాలంటే కివీస్ ప్లేయ‌ర్లు త‌మ ఆట‌ను ఇంకాస్తా మెరుగులు దిద్దుకోవాల్సిన అవ‌స‌రముంది. ప్ర‌స్తుతం తొలి సెమీ పోరులో స‌ఫారీల‌పై ప్ర‌తీకారం తీర్చుకునే ఛాన్స్ కివీస్ కు ల‌భించింది.

ఈ రెండు టీంల్లో గెలిచిన జ‌ట్టు ఫైన‌ల్‌కు సిద్ధం కానుంది. రెండో సెమీస్ మ్యాచ్‌లో(ఇంగ్లాండ్-ఇండియా) విక్ట‌రీ సాధించిన టీంతో మార్చి 8న త‌ల‌ప‌డ‌నుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -