Wednesday, March 4, 2026
E-PAPER
Homeజాతీయంఘ‌నంగా హోలీ వేడుక‌లు

ఘ‌నంగా హోలీ వేడుక‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఉత్త‌ర‌భార‌త్‌లో ఘ‌నంగా హోలీ వేడుక‌లు జ‌రుపుకుంటున్నారు. కుల‌మ‌తాల‌కు అతీతంగా వివిధ రంగాల‌తో వెద‌జ‌ల్లుతూ హ్యాపీ హోలీ అంటూ ప్ర‌జ‌లు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఈక్ర‌మంలోనే సామాన్య ప్ర‌జ‌ల నుంచి ప్ర‌ముఖులు ఆనంద‌కేళీలో ఉల్లాసంగా పాల్గొంటున్నారు. తాజాగా ప్ర‌తిప‌క్ష‌నేత, కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ఆ పార్టీ శ్రేణుల‌తో క‌లిసి హోలీ వేడుక‌ల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని పార్టీ కార్యాల‌యం ఎదుట కాంగ్రెస్ శ్రేణులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. వారితో క‌లిసి ఆయ‌న హోలీ వేడుక‌లు జ‌రుపుకున్నారు.

అదే విధంగా ఇటీవ‌ల ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో క‌డిగిన ముత్యంలా బ‌య‌ట‌ప‌డిన ఆమ్ ఆద్మీ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్ ఆ పార్టీ శ్రేణుల‌తో క‌లిసి ఆనందంగా హోలీ సంబ‌రాలు చేసుకున్నారు. ఢిల్లీలోని ఆ పార్టీ కార్యాల‌యం వ‌ద్ద‌ సిసోడియా, ఆశితీస్‌ల‌తో పాటు అనేక మంది ఆ పార్టీ నాయ‌కులు హోలీ సంబరాల్లో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -