Wednesday, March 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిరంతర అధ్యయనమే గణిత సబ్జెక్టులో విజయానికి సోపానం

నిరంతర అధ్యయనమే గణిత సబ్జెక్టులో విజయానికి సోపానం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
నిరంతర అధ్యయనమే గణిత సబ్జెక్టులో విజయానికి సోపానమని తెలంగాణ గణితఫోరం  జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా రిసోర్స్ గ్రూప్ సభ్యులు బాస రాజ గోపాల్ అన్నారు. బుధవారం కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి గణితం వార్షిక పరీక్ష కోసం విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ  కార్యక్రమంలో బాస రాజ గోపాల్ విద్యార్థులకు వివిధ  సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గణిత పరీక్ష రాసేటప్పుడు సూత్రానికి బాక్స్ గీయాలనీ, గ్రాఫ్ ప్రాబ్లం చేసినప్పుడు స్కేలు కచ్చితంగా రాయాలన్నారు. సరూప త్రిభుజాలు, వృత్తానికి స్పర్శ రేఖలు సమస్యలు చేసేటప్పుడు రఫ్ స్కెచ్ గీయాలనీ, పెన్సిల్ తోటే గ్రాఫ్ గీయాలనీ సూచించారు.

ప్రతి పేజీలో కుడివైపు కొద్ది భాగాలు చిత్తు పని కోసం కేటాయించుకోవాలన్నారు.  ప్రశ్న నెంబర్లు కచ్చితంగా రాయాలనీ, ప్రతి ప్రశ్నను కచ్చితంగా ప్రయత్నం చేయాలనీ వివరించారు.దత్తాంశం రాస్తే  కనీసం మార్కులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఫలితాన్ని అండర్లైన్ చేయడం గానీ, బాక్స్ గీయడం గాని చేస్తే బాగుంటుందని తెలిపారు. గణితం పరీక్షలో ఫలితానికి కాకుండా చేసే పద్ధతికి కూడా మార్కులు కేటాయిస్తారన్నారు.వెన్ చిత్రాలు, శ్రేడులు లెక్కలు చేసేటప్పుడు ప్రతి స్టెప్ కీలకంగా ఉంటుందని, జామెట్రీ నిర్మాణాలు చేసేటప్పుడు చక్కగా చేయాలన్నారు.

పరీక్ష ప్రారంభంలోని ఆరు మార్కుల ప్రశ్నలు పూర్తిచేసే ప్రయత్నం చేయాలన్నారు. సంభావ్యత, సమితిలు, స్టాటిస్టిక్స్ అధ్యాయాలు తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించవచ్చని తెలిపారు. గణితంలో  కనీసం 50 సూత్రాలు,50 నిర్వచనాలు నేర్చుకుంటే 70 నుండి 80 మార్కులు సులభంగా సాధించవచ్చని తెలిపారు. అనంతరం బాస రాజగోపాల్ ను పాఠశాల తరఫున శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ గణిత ఫోరం రాష్ట్ర సలహాదారుడు చౌడారపు రాంప్రసాద్, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -