Wednesday, March 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెంజల్ మండల సర్పంచ్ లకు శిక్షణా తరగతులు

రెంజల్ మండల సర్పంచ్ లకు శిక్షణా తరగతులు

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్ 
రెంజల్ మండలంలోని 17 గ్రామపంచయతీల పరిధిలో నూతనంగా ఎంపికైన గ్రామ సర్పంచులకు ఐదు రోజులు ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు ఎంపీడీవో వి కమలాకర్ తెలిపారు. ఈనెల 2 నుంచి 7 వరకు కలెక్టరేట్ సమీపంలోని న్యాక్ (NAC )భవనంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణ తరగతులలో పరిపాలన వ్యవహారాలు, గ్రామ అభివృద్ధి, విధులు, బాధ్యతల పై శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ తరగతులను ఉదయం 9:30 నుంచి 6 గంటల వరకు శిక్షణ కొనసాగుతుందన్నారు. సర్పంచుల శిక్షణానంతరం త్వరలో మండలంలోని 166 వార్డు సభ్యులకు రెండు విడుదలగా మండల కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -