- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బంజారాహిల్స్‌లో భారీగా కల్తీ నెయ్యిని టాస్క్‌ఫోర్స్ అధికారులు సీజ్ చేశారు. మాసబ్ ట్యాంక్ పోలీసులతో కలిసి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 లో గోల్కొండ టాస్క్‌ఫోర్స్ అధికారులు సోదాలు చేపట్టారు. ఫ్రైడ్ డెయిరీ పేరుతో నిర్వహిస్తున్న కల్తీ నెయ్యి కేంద్రంలో తనిఖీలు చేపట్టి.. రూ.18.26 లక్షల విలువ చేసే 460 కిలోల కల్తీ నెయ్యి, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మహ్మద్ జునైద్‌ను అరెస్ట్ చేశారు. కల్తీ నెయ్యిని పలు హోటళ్లకు, శుభకార్యాలకు నిందితుడు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మాసబ్ ట్యాంక్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -



