Wednesday, March 4, 2026
E-PAPER
Homeకరీంనగర్సెస్ ను విలీనం చేస్తేనే అవినీతి ఆగుతుంది

సెస్ ను విలీనం చేస్తేనే అవినీతి ఆగుతుంది

- Advertisement -

ఈ ఆర్ సి చైర్మన్ కు విన్నవించిన వినియోగదారులు
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ లో 2026- 27 సంవత్సరపు వార్షిక ఆదాయ  ఆవశ్యకత పై విద్యుత్ నియంత్రణ మండలి (ఈ ఆర్ సి )బృందం బహిరంగ విచారణ చేపట్టింది. సెస్ పరిధిలోని వినియోగదారులు తమ సమస్యలను ఈఆర్సికి వివరించారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో తెలంగాణ ఈ ఆర్ సీ బుధవారం నిర్వహించిన బహిరంగ విచారణకు హాజరైన తెలంగాణ ఈఆర్సీ చైర్మెన్ డాక్టర్ జస్టిస్ డీ నాగార్జున, కే రఘు, ఈఆర్సీ టెక్నికల్ విభాగం సభ్యుడు, సీ హెచ్ శ్రీనివాస్ రావులకు సెస్ అధికారులు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్చం అందజేసారు. అనంతరం జిల్లా సమీకృత కార్యాలయంలో జరిగిన బహిరంగ విచారణలో సెస్ సంస్థ వినియోగదారులకు ఎలాంటి సేవలందిస్తున్నారో సెస్ అధికారులు వివరించారు. సంస్థ మనుగడకు తీసుకుంటున్న చర్యల్ని సభ్యుల ముందు క్లుప్తంగా వివరించారు అనంతరం వివిధ గ్రామాల నుండి హాజరైన సెస్ వినియోగదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

సెస్ సంస్థ లో ట్రాన్స్ కో విధానాలు అమలవుతున్నప్పుడు ఈ సంస్థను ట్రాన్స్ కో లోఎందుకు విలీనం చేయడం లేదనీ ప్రశ్నించారు. పాలకవర్గం నిర్ణయాల వల్ల సంస్థ అనేక రాష్ట్రాల్లో ముందుకు సాగుతుందని కానీ ఇక్కడ అలా లేదని ఇది భరించే ఓపిక వినియోగదారులకు లేదని వెంటనే సెస్ సంస్థను ట్రాన్స్ కో లో వెంటనే విలీనం చేయాలని పలువురు డిమాండ్ చేశారు. పాలకవర్గం ఉండడం వల్ల అనేక అవినీతి అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని వీటన్నిటిని నియంత్రించాలంటే ఈ సంస్థను కాపాడాలంటే విలీనం ఏకైక మార్గమని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -