- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి జరిమానా పడింది. రాంచీలో పరిమితికి మించి వేగంగా వాహనం నడిపినందుకు ఆయనకు ట్రాఫిక్ పోలీసులు రూ.1000 ఫైన్ వేశారు. తన ఇంటి సమీపంలో ధోనీ వాహనం వేగంగా వెళ్లడాన్ని నగరంలోని ఆటోమేటెడ్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్ గుర్తించింది. దీంతో మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 183 కింద అధికారులు ఆయనకు ఈ-చలాన్ జారీ చేశారు. ఈ ఉల్లంఘన చిన్నదే అయినప్పటికీ, ధోనీకి సంబంధించిన విషయం కావడంతో సోషల్ మీడియాలో, అభిమానుల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. రాంచీలో ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న క్రమంలో ఈ-చలాన్ జారీ అయినట్లు తెలుస్తోంది.
- Advertisement -



