- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఆఫ్రికా దేశం కాంగోలో పెను విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి రుబయా కోల్టన్ గని కుప్పకూలింది. ఈ ఘటనలో 200 మందికిపైగా మృతి చెందారు. మృతుల్లో 70 మంది చిన్నారులు ఉన్నట్లు ఆ దేశ గనుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ గని తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉంది. బాంబులతోనే ఈ ప్రమాదం జరిగిందని, కేవలం ఐదుగురు మాత్రమే చనిపోయినట్లు రెబల్ గ్రూప్ పేర్కొంది.
- Advertisement -



