- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి శివారులో ఇస్సార్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి ఇస్సార్ వెళ్తున్న రైలు ఇంజిన్ వీల్ బుధవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో విరిగిపోయింది. దీంతో రైలు అక్కడే నిలిచిపోయింది. రైల్వే అధికారులు మరో ఇంజిన్‌ను తీసుకువచ్చి మరమ్మతులు చేపడుతున్నారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
- Advertisement -



