నవతెలంగాణ-హైదరాబాద్: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఇవాళ ముంబాయి వాంఖడేలో రెండో సెమీ పోరు ప్రారంభమైంది. టాస్ గెలిచిన హ్యారీ బ్రూక్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.కీలకమైన ఈ మ్యాచ్‌కోసం ఇంగ్లండ్ ఒక మార్పు చేసింది. రెహాన్ అహ్మద్ స్థానంలో ఓవర్టన్ను ఆడిస్తున్నామని బ్రూక్ చెప్పాడు. తేమ పెద్దగా ప్రభావం చూపదని భావిస్తున్నట్టు చెప్పిన సూర్య.. టీమిండియా మాత్రం ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని వెల్లడించాడు.
భారత్ తుది జట్టు : అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా.
ఇంగ్లండ్ తుది జట్టు : ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బ్యాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, లియాం డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.



