నవతెలంగాణ-హైదరాబాద్: సెకండ్ సెమీ ఫైనల్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. 89 పరుగులతో సంజు కదంతొక్కాగా 20 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 253 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందుంచింది. అభిషేక్(9) ఇషాన్(39), దూబే(43), సూర్య(11), తిలక్(21), పాండ్యా(27) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లు జాక్స్, రషీద్ తలో రెండు వికెట్లు తీయగా ఆర్చర్ ఒక వికెట్ తీశాడు.
తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. వాంఖడే స్టేడియంలో బ్యాటింగ్ దిగిన భారత్‌కు ఆదరే ఆరంభం లభించింది. భారత్ ఓపెనర్లు సంజు, అభిషేక్ ఫోర్లు, సిక్స్‌లతో పరుగులు ఖాతా తెరిచారు. ఆర్చర్ వేసిన తొలి ఓవర్లో ఒక సిక్స, ఫోర్ కొట్టి 12 పరుగులు పిండుకున్నాడు సంజు. జాక్ వేసిన ఒకటో ఓవర్లో రెండు బౌండర్లీ కొట్టి ఫామ్‌లో ఉన్నాడు అనుకున్నా అభిషేక్(9)..అదే ఓవర్లో చివరి బంతికి భారీ షాట్ ఆడి లాంగ్ ఆన్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో ఒక్కసారిగా గ్రౌండ్ మొత్తం నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కిసాన్‌తో జత కలిసి సంజు తనదైన శైలిలో బౌండరీలు బాదాడు.
పవర్ ప్లే(0-6 ఓవర్లు) ముగిసేరికి ఒక వికెట్ నష్టపోయి 67 పరుగులు చేసింది ఇండియా. ఈ క్రమంలో సంజు 20 బంతుల్లో 40 పరుగులతో భీకర ఫామ్‌లో ఉన్నాడు. ప్రతి ఓవర్లో ఓ ఫోర్, సిక్స్‌లతో రన్ రేట్ తగ్గకుండా స్కోర్ బోర్డను పరుగులు పెట్టించాడు. క్రీజులో ఉన్న కిషాన్ అతనికి స్టాండింగ్ ఈస్తూ స్ట్రక్ రొటెంట్ చేశాడు.
ఈక్రమంలో డాసన్ వేసిన ఏడో ఓవర్లో (27 బంతుల్లో ఏడు ఫోర్లు, 3 సిక్స్) అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు సంజు. అదే విధంగా కిషాన్ కూడా తన బ్యాట్‌కు(16 బంతుల్లో 35 రన్స్) పని చెప్పాడు. కానీ రషిద్ వేసిన తొమ్మిదో ఓవర్ రెండో బాల్‌కు ఫోర్ కొట్టిన ఇషాన్(39)..తరువాతి బంతికే భారీ షాట్ ఆడి లాంగ్ ఆన్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఈ సమయంలో బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు జరిగాయి. ఇషాన్ ఔట్ అయినా తర్వాత తిలక్ స్థానంలో శివం దూబే బ్యాటింగ్‌కు దిగాడు. రషిద్ వేసిన 11 ఓవర్లో రెండు సిక్స్‌లు బాదాడు. దీంతో 12 ఓవర్లు ముగిసేరికి ఇండియా స్కోర్ రెండు వికెట్ల నష్టానికి 145 పరుగులతో ఓవర్‌కు 12 రన్స్ సగటుతో పటిష్టమైన స్థితిలో ఉంది. ఈక్రమంలో సెంచరీ దిశగా దూసుకెళ్తున్న సంజు(88 8ఫోర్లు, 7సిక్స్‌లు)ను జాక్స్ వేసిన 13 ఓవర్లో ఔట్ అయ్యాడు. సంజుతో ఔట్‌తో టీమిండియా కెప్టెన్ సూర్య(11) దిగినా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. రషీద్ వేసిన 15 ఓవర్లో మూడో బంతికి సిక్స్ కొట్టి తర్వాత బాల్‌కే స్టంప్ ఔట్‌గా వెనుదిరిగాడు.
ఆ తర్వాత సూపర్ హిట్టర్ పాండ్యా క్రీజులోకి రాగానే రెండు ఫోర్లతో హడలెత్తించాడు. కానీ కర్ణన్ వేసిన 17 ఓవర్లో పాండ్యా సమన్వయ లోపంతో దూబే అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. లేని పరుగు కోసం ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత బంతికే భారీ షాట్ ఆడినా పాండ్యా తృటిలో తప్పించుకున్నాడు. ఆర్చర్ వేసిన 18 ఓవర్లో మూడు సిక్స్‌లు కొట్టి అదే ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు తిలక్(21). చివరి ఓవర్లో పాండ్యా(27) రెండు సిక్స్‌లు కొట్టి తర్వాత బంతికి రనౌట్ అయ్యాడు.
ఆ తర్వాత చేధనకు దిగిన ఇంగ్లాండ్ ఓపెనర్లు సాల్ట్, బట్లర్ తొలి బంతి నుంచి ధాటిగా ఆడేందుకు ప్రయత్నించారు. ఆర్షదీప్ వేసిన తొలి ఓవర్లో మూడు ఫోర్లు బాది ఊపులో ఉన్న ఇంగ్లాండ్ ఓపెనర్లకు.. ఆర్థిక్ పాండ్యా కళ్లెం వేశాడు. అతను వేసిన ఒకటో ఓవర్లో తొలి బంతికే సాల్ట్(5) క్యాచ్ ఔట్ అయ్యాడు. కెప్టన్ బ్రూక్ బ్యాటింగ్ దిగాడు. కానీ ఎక్కువ సేపులో క్రీజులో నిలువలేకపోయాడు. బుమ్రా వేసిన నాల్గో ఓవర్లో భారీ షాట్ కొట్టగా లాంగ్ ఆన్ దిశగా బాల్ గాల్లోకి దూసుకెళ్లింది. మెరుపు వేగంతో పరుగెత్తిన అక్షర్ అద్భతమైన క్యాచ్ పట్టుకున్నాడు. బ్రూక్ 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. అతని ఔట్‌తో బెతల్‌తో జతకట్టిన బట్లర్..ఆచితూచి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వరుణ్ చక్రవర్తి వేసిన ఐదో ఓవర్లో మూడు సిక్స్‌లు కొట్టాడు బెతల్. కానీ అదే ఓవర్లో బట్లర్(25)ను క్లీన్ బౌల్డ్ చేశాడు వరుణ్. ఆ ఓవర్లో మొత్తం 25 పరుగులు ఇచ్చి ఓ వికెట్ తీశాడు వరుణ్. దీంతో పవర్ల ప్లే(0-6) ముగిసేరికి మూడు వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది ఇంగ్లాండ్.
ఓ వైపు వికెట్లు పడుతున్నా రన్ రేట్ తగ్గకుండా ఇంగ్లాండ్ బ్యాటర్లు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఆ తర్వాత బాంటన్‌తో జత కలిసిన బెతల్ బ్యాటింగ్ బాద్యతను మోశాడు. ఏడో ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టి ఊపులోవున్న బాంటన్(17)ను క్లీన్ బౌల్డ్ చేశాడు అక్షర్. జాక్స్ రాకతో బెతల్ దూకుడు పెంచాడు. 19 బంతుల్లో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. ఇద్దరు కలిసి ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లతో మోత మోగించారు. ఈక్రమంలోనే బౌలింగ్(13 ఓవర్లో) వేసిన ఆర్షదీప్ జాక్స్(35) వికెట్ తీసి భారత్ అభిమానులకు ఊరట నిచ్చాడు. స్క్వేర్ లెగ్ దిశ భారీ షాట్ కొట్టగా అక్షర్ సూపర్ డూపర్ క్యాచ్ అందుకోగా..బ్యాలెన్స్ అదుపు తప్పా దగ్గరలో ఉన్న దూబెకు బాల్ అందించాడు. ఈ క్యాచ్ తో ఇన్నింగ్స్ టీమిండియా వైపు తిరిగింది. దూబె వేసిన చివరి ఓవర్లో బెతల్ రనౌట్ కాగా 20 పరుగుల తేడాతో టీమిండియా విజయం లాంఛనమైంది. అయితే చివరలో ఆర్చర్ భారీ సిక్స్‌లు కొట్టినా గెలుపు అంతరం తగ్గించినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 246 పరుగులు చేసి విజయానికి కావాల్సిన 7 పరుగుల తేడాతో పోరాడి ఓడిపోయింది.



