Friday, March 6, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్ లో రెండు రోజులు నీటి సరఫరా బంద్

హైదరాబాద్ లో రెండు రోజులు నీటి సరఫరా బంద్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్​ : మంజీరా ఫేజ్–-3, పెద్దాపూర్ పంప్ హౌస్ లో  35 ఏండ్లకు పైబడిన హెచ్​టీ ఎలక్ట్రికల్ ప్యానెల్స్​ను తొలగించి, కొత్త ప్యానెల్స్‌‌ ఏర్పాటు చేస్తుండడంతో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని వాటర్​బోర్డు అధికారులు తెలిపారు. 7న శనివారం ఉద‌‌యం 8 గంట‌‌ల‌‌ నుంచి 8వ తేదీ ఆదివారం రాత్రి 8 గంట‌‌ల వ‌‌ర‌‌కు కొనసాగుతాయన్నారు. ఈ కారణంగా శని, ఆదివారాల్లో నీటి సరఫరా ఉండదని తెలిపారు. షేక్‌‌పేట్ పరిధిలోని మణికొండ, కోకాపేట్, నార్సింగి, మంచిరేవుల తదితర ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదని, భోజగుట్ట ప్రాంతానికి తక్కువ ప్రెషర్​తో నీళ్లు వస్తాయని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -