- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ భర్త గట్టు గంగారం, ఆయన కుటుంబీకులు కలిసి దమ్మ తిరుపతి అనే వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశారు. కారుకు అడ్డు వచ్చాడనే కారణంతో వారు తిరుపతిని తీవ్రంగా కొట్టారు. గాయపడిన బాధితుడిని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
- Advertisement -



