– నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే తాటి
నవతెలంగాణ – అశ్వారావుపేట
బీఆర్ఎస్ నాయకుడు జక్కుల రాంబాబుకు మాతృ వియోగం జరిగింది. మండలంలోని నారాయణపురం వాసి రాంబాబు మాతృమూర్తి నాగమణి వయోభారంతో గురువారం మృతి చెందారు. శుక్రవారం ట్రైకార్ మాజీ చైర్మన్,ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు,మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు జల్లిపల్లి శ్రీరామ మూర్తి,కాసాని చంద్ర మోహన్, నాగశేషపద్మ, డాక్టర్ భూక్యా ప్రసాద్ లు నారాయణపురం చేరుకుని నాగమణి కి నివాళులు అర్పించారు.కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన విభాగం అశ్వారావుపేట నియోజవర్గ అధ్యక్షుడు మోటురి మోహన్,నాయకులు అఖిల్,గంగాధర్,శ్రీను,హరి,బాలి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నాగమణి అంగన్వాడీ విశ్రాంత ఉద్యోగి గా ఉన్నారు.



