Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా సంఘాల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం 

మహిళా సంఘాల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం 

- Advertisement -

మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి 
నవతెలంగాణ – మిడ్జిల్ 

మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి చెప్పారు. శుక్రవారం మండలంలోని పెద్దగుండ్ల తండలో మహిళా సంఘం  భవన నిర్మాణానికి సర్పంచ్ రాజు నాయక్ తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాండాలలో మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి కృషి చేస్తుందని అన్నారు.

 మహిళా సంఘాలు ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. మహిళలు సంఘాల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించుకొని కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసుకుంటున్నారని అన్నారు. మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక భవనం అవసరం ఉండటంతో ఈ భవన నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

గ్రామాల్లో మహిళలు ఐక్యంగా పనిచేస్తే గ్రామాభివృద్ధి వేగంగా జరుగుతుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళల భాగస్వామ్యం పెరిగితే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో , ఉప సర్పంచ్ శ్రీను నాయక్, గ్రామపంచాయతీ కార్యదర్శి శైలజ, మాజీ ఉప సర్పంచ్ తిరుపతి నాయక్, మాజీ వార్డు సభ్యుడు శంకర్, దీప్లా, బాబు, దేవ్య, ఆంగోత్ దేవుల నాయక్ , శ్రీను, కుమార్, శంకర్, తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, మహిళా సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -