- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, కమల్ హాసన్‌కు పైడి జయరాజ్ అవార్డు, ఆర్.నారాయణమూర్తికి కాంతారావు అవార్డు, జయసుధకు నాగేశ్వరరావు స్పెషల్ అవార్డు, సుద్దాల అశోక్ తేజకు సినారే అవార్డు, అశ్వనీదత్‌కు నాగిరెడ్డి చక్రపాణి అవార్డు ప్రకటించారు. ఈ అవార్డులను ఈ నెల 19న ఉగాది రోజున ప్రదానం చేయనున్నారు.
స్పెషల్ అవార్డులు..
- ఎన్టీఆర్ జాతీయ అవార్డు – చిరంజీవి
- పైడి జయరాజ్ అవార్డు – కమల్ హాసన్
- నాగిరెడ్డి చక్రపాణి అవార్డు – అశ్విని దత్
- ఏఎన్నార్ అవార్డు – జయసుధ
ఫీచర్ ఫిల్మ్స్.. - ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి
- ఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరా
- ఉత్తమ తృతీయ చిత్రం – ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్‌షో
- ఉత్తమ నటుడు – నాగ చైతన్య (తండేల్)
- ఉత్తమ నటి – రష్మిక (ది గర్ల్‌ఫ్రెండ్)
- ఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
- బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ – తండేల్
- ఉత్తమ సోషల్ మెసేజ్ సినిమా – కోర్ట్
- ఉత్తమ డాక్యుమెంటరీ – యూనిటీ
- ఉత్తమ ప్రజాదరణ చిత్రం – సంక్రాంతికి వస్తున్నాం
- బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ పరిచయ దర్శకుడు – సాయి మార్తాండ్ (లిటిల్ హార్ట్స్)
- ఉత్తమ బాలల చిత్రం – అనగనగా
- ఉత్తమ సహాయ నటుడు – శివాజీ
- ఉత్తమ సహాయనటి – భూమిక (యూఫోరియా)
- ఉత్తమ సంగీత దర్శకుడు – మార్క్ రాబిన్ (దండోరా)
- ఉత్తమ గాయకుడు – అనురాగ్ కులకర్ణి (రాజు వెడ్స్ రాంబాయి)
- ఉత్తమ గాయని – సాహితీ (కన్నప్ప)
- ఉత్తమ బాలనటుడు – మాస్టర్ రోహన్ (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో)
- ఉత్తమ కథా రచయిత – గుణశేఖర్ (యుఫోరియా)
- ఉత్తమ స్క్రీన్‌ప్లే – అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)
- ఉత్తమ లిరిసిస్ట్ – నందకిశోర్ (కుబేర)
- ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్)
- ఉత్తమ ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్)
ఉత్తమ ఆడియోగ్రాఫర్ – ఎం.ఆర్. రాధాకృష్ణన్ (కిష్కింధపురి) - ఉత్తమ కొరియోగ్రాఫర్ – సందీప్ (ఛాంపియన్)
- ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ – తోట తరణి (ఛాంపియన్)
- ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ – వై.గోవిందరాజు (అఖండ 2)
- ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ – చంద్రకాంత్ సొనావాని, అజయ్‌కుమార్ నంబాల (ఛాంపియన్)
- ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ – పీటర్ హెయిన్స్ (ఛాంపియన్)
- స్పెషల్ జ్యూరీ అవార్డులు..
- శ్రీరాజ్ రాచకొండ (23 ఫిల్మ్)
- చైతు జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
- రోషన్ మేక (ఛాంపియన్)
- అనంతిక సనీల్ కుమార్ (8 వసంతాలు)
- ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్స్
- యూనిటి (మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్) – చిరందాస్ శ్రీకాంత్
- ది ఫస్ట్ యాక్షన్ హీరో పైడి జయరాజ్ ప్రస్థానం – పొన్నం రవిచంద్ర
- మహామనిషి డాక్టర్ ఏఎస్ రావు – బాలబ్రహ్మచారి పూసపాటి
- ఉత్తమ షార్ట్స్ ఫిల్మ్స్
- వనజీవి రామయ్య – భూసం రవీంద్రనాథ్
- మౌనమే నీ భాష – రవీంద్రవర్మ ఇందుకూరి, విశ్వాస్ హనుకర్
- సైబర్ స్లేవరీ – కె.నీలిమ
- డిప్లొమా ఆఫ్ మెరిట్: తల్లిదండ్రుల ఆత్మ గౌరవం (కనపర్తి హనుమండ్లు)
- బెస్ట్ బుక్ ఇన్ తెలుగు- శూన్యం నుంచి శిఖరాగ్రాలకు (ప్రభు)
- ఉత్తమ సినీ విమర్శకుడు – హెచ్ రమేశ్‌బాబు
- Advertisement -



