నవతెలంంగాణ-హైదరాబాద్: దక్షిణ స్పెయిన్‌లోని అల్మేరియాలో కార్చిచ్చు చెలరేగింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతిచెందినట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. మరో 19 మంది గల్లంతు అయ్యారని వెల్లడించింది. సుమారు 600 మంది నివాసితులు నిరాశ్రయులయ్యారు. దాదాపు 120 మంది నివాసితులను రాత్రికి రాత్రే సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఆ దేశ ప్రభుత్వం పేర్కొంది. అల్మోకైజర్, ఫ్యూయెంటె డెల్ అల్బారికో, లాస్ పినోస్, లా సెరెనా సమీపంలోని బెడార్‌లోని పినార్ తదితర సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కారణాలు ఇంకా తెలియలేదు. ఆ దేశంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో ఉన్న నేపథ్యంలో వాటివల్లే అడవికి నిప్పు అంటుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు.
దక్షిణ స్పెయిన్‌లో భారీ కార్చిచ్చు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



