Tuesday, April 29, 2025
Homeనేటి వ్యాసంమోడీ, ఆరెస్సెస్‌ కేంద్ర కార్యాలయ సందర్శన

మోడీ, ఆరెస్సెస్‌ కేంద్ర కార్యాలయ సందర్శన

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల నాగపూర్‌లోని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆరెస్సెస్‌) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి ఆరెస్సెస్‌ వ్యవస్థాపకుడు కే.బీ.హెడ్గేవార్‌, ఆరెస్సెస్‌ రెండవ సర్సంగ్‌ చాలక్‌ మాధవ్‌ సదాశివ్‌ గోల్వాల్కర్‌లకు నివాళులు అర్పించడం అందరిలోనూ చాలా ఆసక్తిని రేకెత్తించింది. బాగా ప్రచారం అయిన ప్రధానమంత్రి నాగ్‌పూర్‌ పర్యటనను, ఆరెస్సెస్‌లో తన ప్రతిష్టను బలోపేతం చేసుకునేందుకు ఏర్పాటు చేయబడిన కార్యక్రమంగా చాలా మంది వ్యాఖ్యానించారు. ఈ సెప్టెంబర్‌ నాటికి మోడీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారనీ, భారతీయ జనతా పార్టీ నిబంధనల ప్రకారం ఆయన పదవీ విరమణ చేస్తారని మరొక అంచనా కూడా ఉంది.
తండ్రి (ఆరెస్సెస్‌) – కొడుకు (బీజేపీ) మధ్య సంబంధాలు దెబ్బ తిన్నట్టు కనిపించడానికి ఇంకొన్ని కారణాలు ఉన్నాయి. 2024 సాధారణ ఎన్నికల సమయంలో బీజేపీకి ఇప్పుడు స్వంతంగా గెలవగలిగే సామర్థ్యం ఉందనీ, తమకు ఆరెస్సెస్‌ మద్దతు అవసరం లేదనీ, గతంలో బీజేపీకి తక్కువ బలం ఉన్న కారణంగా ఎన్నికల్లో ఆరెస్సెస్‌ మద్దతు అవసరం ఉండేదని బీజేపీ అధ్యక్షుడు జే.పీ.నడ్డా వ్యాఖ్యానించాడు. తాను ‘జీవరహితుడననీ’, ఈ భూమి మీద పని చేయడానికి దేవుడు తనను నేరుగా పంపాడని మోడీ చేసిన ప్రకటన రెండవ కారణం. ఈ ప్రకటనను ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌, మోడీలో ‘పెరిగిన అహంకారానికి’ సంకేతంగా భావించాడు. కొందరు, తాము ఉన్నతులం (దేవుళ్ళు) అని విశ్వసించడం మొదలుపెట్టి, తరువాత తమను తాము దేవుళ్ళుగా ప్రకటించుకుంటారని భగవత్‌ అన్నాడు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి బలం తగ్గింది. 2024 లోక్‌ సభ ఎన్నికల్లో ఆరెస్సెస్‌ పూర్తి సామర్థ్యంతో పాల్గొనలేదనే అభిప్రాయం ఒకటి ఉంది. వెంటనే అది మహారాష్ట్ర, హర్యానా శాసనసభల ఎన్నికల్లోకి దూకింది. ఆరెస్సెస్‌ కు సంబంధించినంతవరకు, ఖలిస్తాన్‌ ఉద్యమాన్ని భారతీయ ఐక్యతకు ముప్పుగా భావించిన సందర్భంలో,1984 ఎన్నికలు మినహాయిస్తే, ఆరెస్సెస్‌ ఎప్పుడూ బీజేపీకి అండగా నిలిచి, ఎన్నికల్లో దాని ఎదుగుదలకు ఉపయోగపడింది. దీనికి ప్రధానంగా ప్రణాళికలు రచించేది ఆరెస్సెస్‌. దాని రాష్ట్రీయ ప్రతినిధి సభ (జాతీయ ప్రతినిధుల కమిటీ) సమన్వయంతో దాని బహుళ అనుబంధ సంస్థలు వాటి స్వంత ఎజెండాల్ని అనుసరిస్తు న్నప్పటికీ, సమాజంలోని వివిధ వర్గాల్లో గత విలువలను (మనుస్మతి) కీర్తించడానికి ఆరెస్సెస్‌ భావజాలాన్ని కూడా వ్యాప్తి చేస్తాయి. ముస్లింలు, క్రైస్తవులు విదేశీ మూలాలకు చెందిన మతాలకు చెందిన వారు కావడంతో ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థలు వారికి వ్యతిరేకంగా ద్వేష భావాల్ని కూడా వ్యాప్తి చేస్తాయి. అదే సమయంలో, ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఆ సంస్థలు శక్తి వంచన లేకుండా కషి చేస్తాయి.
హిందూ మహాసభకు చెందిన శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ సహాయ సహకారాలతో భారతీయ జనసంఫ్‌ు ఏర్పడింది. ముఖర్జీ మరణం తరువాత ఆరెస్సెస్‌ నెమ్మదిగా బీజెఎస్‌ను తన స్వాధీనంలోకి తెచ్చుకోవడంతో ఆరెస్సెస్‌ పూర్తి స్థాయిలో ఒక రాజకీయ సంస్థను ఏర్పాటు చేసుకుంది. ఆరెస్సెస్‌, బీజేపీ వాటి ఇతర సంతతి మధ్య పని విభజన చాలా స్పష్టంగా ఉంది. 1980లో విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌ పీ) రామ మందిర ఉద్యమాన్ని ప్రారంభించి, ఆ తర్వాత బీజేపీ దానిని చేపట్టి, జాతీయ రాజకీయ ఎజెండాగా మార్చి దాని నుండి రాజ కీయంగా లబ్ది పొందిన తీరు ఒక మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. తన గురించి తాను ప్రచారం చేసుకునేందుకు, మతపరంగా మైనార్టీలు, సమాజంలోని బలహీన వర్గాలు ముఖ్యంగా దళితులు, ఆదివాసీలు, మహిళలకు వ్యతిరేకంగా అపోహలు సష్టించడానికి ఆరెస్సెస్‌ గత వైభవానికి, తప్పుడు చరిత్రకు సంబంధించిన అంశాలను లేవనెత్తుతుంది. దాని శాఖలు, ఇతర సామాజిక కార్యక్రమాల ద్వారానే సమాజంలో అది బలంగా తయారైంది.
భారతీయ సమాజం భూస్వామ్య సమాజం నుండి వలసవాద వ్యవస్థకు, ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజకీయంగా మార్పు చెంది నప్పటికీ, ఆరెస్సెస్‌ తన శాఖల ద్వారా రాజ్యాలు, భూస్వామ్య సామాజిక కాలాల నాటి కుల, లింగ శ్రేణీగత వ్యవస్థల సూత్రాలను చాలా తెలివిగా ప్రచారం చేసింది. దీనికి ఏకలవ్య విద్యాలయాలు, వనవాసీ కళ్యాణ్‌ ఆశ్రమ్‌, సేవా భారతి,రాష్ట్ర సేవికా సమితి లాంటివి అనేకం తోడ్పాటును అందించాయి. పౌర సమాజం, సామాజిక రాజకీయ నిర్మాణంలోకి ఆరెస్సెస్‌ చొరబాటు నిరంతర ప్రక్రియ అయినప్పటికీ రాష్ట్రాల్లో, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో ఇది మరింత పెరిగింది.ఇప్పుడు శాఖలకు తోడు, మహిళలు, పిల్లలు, వద్ధులను తమ భావజాల చట్రంలో ఉంచేందుకు కమ్యూనిటీ గ్రూపుల కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవలి కాలంలో మా ప్రాంతంలో ఒక పిక్నిక్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక ముస్లిం మహిళ ఆ పిక్నిక్‌లో పాల్గొనాలనుకుంది, కానీ ఆ కార్యక్రమంలో చేసే ప్రసంగాలు, ఇతర కార్యక్రమాల వల్ల ఆమె ఇబ్బంది పడుతుందని ఆమెకు స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర సేవికా సమితి ఉదయం నిర్వహించే శాఖలకు వెళ్లే మహిళలు చేతిలో లాఠీ కర్రలతో నడుచుకుంటూ వెళ్తారు.
గడిచిన దశాబ్ద కాలంలో బీజేపీ పాలన, ఆరెస్సెస్‌ హిందూ జాతీయ ఎజెండాలో భాగమైన రామ మందిరం, ఆర్టికల్‌ 370 రద్దు, ట్రిపుల్‌ తలాక్‌, ఎన్‌ఆర్సీలను అమలు పరిచింది. ఇటీవలే లోక్‌సభ వక్ఫ్‌ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. లోతుగా చూస్తే ఆరెస్సెస్‌, బీజేపీకి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. హిందూ రాజ్య స్థాపన అనే వారి ఐక్య లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన వ్యూహంలో కొన్ని విభేదాలు ఉండవచ్చు.
నాగపూర్‌లో ఆరెస్సెస్‌ ప్రధాన కార్యాలయంలో హెడ్గేవార్‌, గోల్వాల్కర్‌లు తమకు మార్గాన్ని చూపినందుకు వారికి మోడీ నివాళులు అర్పించాడు. ఏమిటి ఆ మార్గం? ఒకటి: స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం విలువలతో కూడిన సమ్మిళిత జాతీయవాదం కొరకు కషి చేస్తున్న భారత జాతీయోద్యమ విలువలకు దూరంగా ఉండటం. రెండు: ‘త్రెట్స్‌ టు హిందూ నేషనల్‌ ముస్లిమ్స్‌, క్రిస్టియన్స్‌, అండ్‌ కమ్యూనిస్ట్స్‌’ అనే గోల్వాల్కర్‌ రచనను వారు నిరాకరించే ప్రయత్నం చేస్తుండగా, ఆచరణలో వారి విధానాలు దీనినే అనుసరిస్తున్నాయి. ఈ 2025లో ఇటీవలే జరిగిన ఈద్‌ వేడుకే దీనికొక స్పష్టమైన ఉదాహరణ. ఒక రాష్ట్రం ఈ పండుగ సందర్భంగా ఇవ్వాల్సిన సెలవు దినాన్ని ‘ఐచ్ఛిక సెలవు దినం’గా మార్చింది. రోడ్ల పై నమాజ్‌ చేయడాన్ని వ్యతిరేకిస్తూ, నమాజ్‌ చేస్తున్న వారిపై కొన్ని ప్రాంతాల్లో పోలీసులు దాడులు చేశారు. ఉత్తరప్రదేశ్‌ లో ఒకరు ఇంటి మేడ పై సమాజ్‌ చేయడాన్ని కూడా నిషేధించారు. కాబట్టి గడిచిన పదేళ్ల మోడీ పాలన గోల్వాల్కర్‌ చెప్పిన విషయాలను నిజం చేస్తుంది.
క్రైస్తవులకు సంబంధించిన విషయాలకు వస్తే, ఒడిశా(అక్కడ మొదటిసారి బీజేపీ ప్రభుత్వం ఉంది)లో చనిపోయిన వారి మత దేహాలకు అంత్యక్రియలు చేయడం అంత తేలికైన విషయం కాదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. బాలాసోర్‌ అనే జిల్లాలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 13(3) ఏ ను అనుసరించి ఆదివాసీ క్రైస్తవులు తమ గ్రామంలో మత దేహాన్ని ఖననం చేసే హక్కు లేదని, తప్పు దారి పట్టించే వాదనలు చేస్తూ సార్నా మాఝీ అనే గిరిజన సంస్థ ఆదివాసీ క్రైస్తవులను గ్రామ బహిష్కరణ చేస్తామని బెదిరిస్తుంది. ఆరెస్సెస్‌ భావజాలం నుండి ప్రేరణ పొందిన మోడీ, భారతదేశం అభివద్ధి చెందుతుందని అదే పనిగా చెబుతున్నాడు. ఒకసారి అంతర్జాతీయంగా సంతోషం, మత స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ, ఆకలి, ప్రజాస్వామ్యం సూచికలను పరిశీలిస్తే భారతదేశం ర్యాంకు పతనం దిశలో ఉన్నట్టు తెలుస్తోంది.
‘వికాస్‌’ (అభివద్ధి) అంటే, ఈ దేశంలో అభివద్ధి చెందడానికి లేదా బ్యాంకుల నుంచి దోచుకున్న పెద్ద మొత్తం డబ్బుతో ఈ దేశాన్ని విడిచి వెళ్లడానికి చట్టాల్ని ఉల్లంఘించే వారు సంపదను దోచుకోవడం అని మోడీకి, అతని భావజాలానికి అనిపిస్తుంది. కాబట్టి మాటలకు, చేతలకు మధ్య ఉండే సారూప్యత ఏమిటి? ఇటీవలే మోడీ నాగపూర్‌ పర్యటనకు ఒక స్పష్టమైన రాజకీయ లక్ష్యం ఉంది. ఆయన మాటలు ఎన్నికల ప్రయోజనాల కోసం ప్రజల దష్టిని ఆకర్షించేవిగా ఉంటున్నాయి.
(”న్యూస్‌ క్లిక్‌” సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్‌,9848412451
రామ్‌ పునియానీ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img