- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాను ఎంపీడీఓ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. స్లాబ్ పూర్తి స్థాయిలో అయిన వారికి ఉగాదిలోగా గృహ ప్రవేశం చేయాలని సూచించారు. ఇండ్లు మంజూరైన లబ్ధిదారులందరూ నిర్మాణాలను కొనసాగించాలని అన్నారు. గ్రామాలలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇంటి కొరకు దరఖాస్తులు చేసుకుంటే వారికి మంజూరు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణాల్లో ఉన్న లబ్దిదారులకు విడతల వారీగా వారి ఖాతాలలో నగదు జమ చేస్తామని స్పష్టం చేశారు.
- Advertisement -



