- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : టి20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత కెప్టెన్ సూర్య రిటైర్మెంట్ ప్రకటిస్తారనే ఊహాగానాలకు తెరపడింది. ‘నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. ఇప్పుడు అంతా బాగానే ఉందిగా. రిటైర్మెంట్ గురించి ఆలోచన ఎందుకు?’ అని మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్‌మీట్‌లో ఓ రిపోర్టర్ ప్రశ్నకు సూర్యకుమార్ యాదవ్ బదులిచ్చారు. ప్రస్తుతం తన దృష్టి అంతా ఒలింపిక్స్‌తో పాటు తదుపరి టి20 వరల్డ్ కప్ గెలవడంపై ఉందని భవిష్యత్ ప్రణాళికలు స్పష్టం చేశారు. ఈ 2 మెగా ఈవెంట్లు 2028లో జరగనున్నాయి.
- Advertisement -



