Monday, March 9, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఈ చమురు ధరల పెరుగుదల స్వల్పకాలికమే: ట్రంప్

ఈ చమురు ధరల పెరుగుదల స్వల్పకాలికమే: ట్రంప్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై జరిపిన దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. అయితే ఈ ధరల పెరుగుదల కేవలం స్వల్పకాలికమేనని, ప్రపంచ భద్రత, శాంతి కోసం మనం చెల్లించే “చిన్న మూల్యం” మాత్రమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రుత్ సోషల్’లో ఒక పోస్ట్ చేశారు. ‘ఇరాన్ అణు ముప్పు పూర్తిగా తొలగిపోయిన వెంటనే చమురు ధరలు వేగంగా పడిపోతాయి. అమెరికా, అలాగే ప్రపంచ భద్రత, శాంతి కోసం ఈ మాత్రం స్వల్పకాలిక ధరల పెరుగుదలను భరించడం చాలా చిన్న విషయం’ అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఇంధన ధరల పెరుగుదలపై అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ స్పందిస్తూ.. గ్యాస్ స్టేషన్ల వద్ద అమెరికన్లకు ఈ ధరల భారం మరికొన్ని ‘వారాల పాటు’ తప్పకపోవచ్చని అంగీకరించారు. అయితే, ఈ ఇబ్బంది నెలల తరబడి ఉండబోదని, కొద్ది వారాల్లోనే పరిస్థితులు చక్కబడతాయని ప్రజలకు భరోసా ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -