- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన కావూరి సాంబశివరావు (82) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన 1984, 1989, 1998లో మచిలీపట్నం, 2004, 2009లో ఏలూరు లోక్‌సభ స్థానాల నుంచి గెలుపొందారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర జౌళి శాఖ మంత్రిగానూ పనిచేశారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఆయన.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
- Advertisement -



