నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతు 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఎగ్జామ్స్ మెటీరియల్ అందజేశారు. ఈ మేరకు సోమవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక రుద్రసేన యూత్ (2014-15 పాఠశాల పూర్వ విద్యార్థులు) సభ్యుల ఆర్థిక సహాయంతో ప్యాడ్స్, పెన్నులు, పెన్సిల్లు, ఎగ్జామ్ కు సంబంధించిన మెటీరియల్ ను గ్రామ సర్పంచ్ బెజ్జరపు రాకేష్ చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రాకేష్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉత్తమ మార్కులు సాధించడం ద్వారా పాఠశాలకు కన్న తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు దుర్శనం సందీప్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బట్టల హేమంత్, ప్రధానోపాధ్యాయులు, మధుపాల్, రుద్ర సేన యూత్ సభ్యులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.



