– పాల్గొన్న సర్పంచ్ ఆశా పాటిల్..
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని మాదాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు గ్రామ సర్పంచ్ ఆశా పార్టీ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆశా పాటిల్ సర్పంచ్ పాఠశాలను ఉదయం 9 గంటలకు సందర్శించి ప్రేయర్ లో పాల్గొనడం జరిగింది . ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా పాఠశాల పిల్లలందరికీ రక్త పరీక్షలు చేయించి బ్లడ్ గ్రూపు పర్సెంట్ చెక్ చేయించడం జరిగినది. పిల్లలకు ఉపాధ్యాయులు నేర్పుతున్న విద్యను విద్యార్థులకు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి ఆశా పాటిల్ , ఉప సర్పంచ్, డ్వాక్రా గ్రూప్ సంఘ జ్యోతి మరియు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజయ్య సార్ , ఉపాధ్యాయులు సంతోష్, గ్రామస్తులు రాజు పటేల్ , అశోక్ పటేల్ , రామచంద్ర పటేల్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొనడం జరిగినది.
మాదాపూర్ లో విద్యార్థులకు వైద్య పరీక్షలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



