Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేజీబీవీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి

కేజీబీవీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి

- Advertisement -

టీఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు నరసింహులు 
నవతెలంగాణ – మిడ్జిల్

కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరును పర్మినెంట్ చేయాలని యు.ఎస్.ఆర్ సామాగ్రా శిక్ష ఉద్యోగస్తులు టైం స్కేల్ అమలు చేయాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ నరసింహులు ప్రభుత్వాన్ని కోరారు. టీఎస్ యుటిఎఫ్  రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు  మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో భోజన విరమణ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ..ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వము సానుకూలంగా పరిశీలించాలని తెలిపారు. సమ్మె కాలానికి వేతనాలు మంజూరు చేయాలని , ఉద్యోగస్తులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని చెప్పారు. సమస్యల కోసం శాంతియుతంగా ఉపాధ్యాయ సంఘం పోరాటం చేస్తుందని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో  మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటయ్య, రమేష్  కస్తూర్బా,ప్రత్యేక అధికారి కవిత, ఉపాధ్యాయలు,అజిత, శిరీష, ధనలక్ష్మి, విజయలక్ష్మి, చంద్రకళ, శ్యామల కుమారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -