Monday, March 9, 2026
E-PAPER
Homeజాతీయంఇండిగో విమాన ప్ర‌యాణంలో అనూహ్య ప‌రిణామం

ఇండిగో విమాన ప్ర‌యాణంలో అనూహ్య ప‌రిణామం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఇండిగో విమాన ప్ర‌యాణంలో అనూహ్య ప‌రిణామం చోటుచేసుకుంది.ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మాంచెస్టర్‌కు బయలుదేరిన ఇండిగో ఫ్లయిట్ 6E33 బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ అనూహ్యంగా గాలిలో ఉండగానే ‘యూటర్న్’ తీసుకుని వెనక్కి తిరిగొచ్చింది. ఇథియోపియా సరిహద్దు సమీపంలో ఇండిగో విమానం యూటర్న్ తీసుకుంది. అయితే దీనికి కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు. ప‌శ్చ‌మాసియా నెల‌కొన్న యుద్ధం కార‌ణంగా అనేక విమాన స‌ర్వీసులు ర‌ద్దైన విష‌యం తెలిసిందే.ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఎయిర్‌స్పేస్ పరిమితుల కారణంగా మధ్యప్రాచ్యం, ఎంపిక చేసిన అంతర్జాతీయ గమ్యాలకు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 3 వరకూ 500కు పైగా విమానాలను రద్దు చేసినట్టు ఈ నెల మొదట్లో ఇండిగో ప్రకటించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -