- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం వరి రైతులపైనా ప్రభావం చూపుతోంది. చెన్నై పోర్టు నుంచి ఆఫ్రికన్ దేశాలకు బియ్యం ఎగుమతులు ఆగిపోగా, ఇప్పటికే బయల్దేరిన కంటైనర్లూ వెనక్కి వచ్చేశాయి. దీంతో వారం కిందటి వరకు పుట్టి(850KG) ధాన్యం ధర ₹22,500 ఉండగా ప్రస్తుతం ₹21Kకు పడిపోయింది. ఇంకొన్ని రోజులు ఎక్స్‌పోర్ట్స్ నిలిచిపోతే రేట్లు మరింత పతనం కానున్నాయి. అలాగే $11.8Bn విలువైన ఆహారోత్పత్తుల ఎగుమతులపైనా ప్రభావం పడనుందని అంచనా.
- Advertisement -



