Tuesday, March 10, 2026
E-PAPER
Homeఖమ్మంతెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్..!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఖమ్మం నగరంలో వెలుగుమట్ల భూదాన్ భూమి బాధితుల తరఫున పోరాడుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితులకు మద్దతుగా ఖమ్మం అంబేద్కర్ భవన్‌లో ఆమె చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. కవితతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐకాస రాష్ట్ర ఛైర్మన్ విశారదన్ మహరాజ్‌ను కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

నేటి ఉదయం 6 గంటల సమయంలో ఖమ్మం సీపీ ఆధ్వర్యంలో సుమారు 600 మంది పోలీసులు ఒక్కసారిగా దీక్షా శిబిరాన్ని చుట్టుముట్టారు. నాయకులందరినీ బలవంతంగా వాహనాల్లో ఎక్కించి హైదరాబాద్‌కు తరలించారు. ఏళ్ల తరబడి నివసిస్తున్న పేదలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం దుర్మార్గమని ఈ సందర్భంగా కవిత మండిపడ్డారు.

పోలీసు కస్టడీలో ఉన్నప్పటికీ తన నిరాహార దీక్ష కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు. ప్రభుత్వం దిగివచ్చి, కూల్చివేతలు జరిగిన చోటే బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాలు కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు. బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -