- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం ఉదయానికి శ్రీవారిని దర్శించుకునేందుకు 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు లేనివారికి సర్వదర్శనం అయ్యేందుకు 15 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. అలాగే రూ.300 శీఘ్రదర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు 3-4 గంటల సమయం పడుతుందని పేర్కొంది. నిన్న (సోమవారం) 72,526 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 26,664 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు ధన, వస్తురూపేణ సమర్పించిన కానుకల విలువ రూ.4.41 కోట్లు ఉంటుందని టీటీడీ వివరించింది.
- Advertisement -



