Tuesday, March 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు బస్సు డ్రైవర్లు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు బస్సు డ్రైవర్లు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నల్గొండ జిల్లా నార్గట్‌పల్లి వద్ద హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్‌టేక్ చేస్తున్న సమయంలో బస్సు, లారీ ఢీకొన్నాయి. దీంతో రోడ్డు పక్కన వాహనాలను ఆపి మాట్లాడుకుంటుండగా.. మరో లారీ వచ్చి ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బస్సు డ్రైవర్లు అక్కడికక్కడే మృతిచెందగా.. బస్సు క్లీనర్ తీవ్రంగా గాయపడ్డాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటల ప్రాంతంలో కాకినాడ వైపు వెళ్తున్న మోజో ప్రయివేటు ట్రావెల్స్ బస్సు, రాజమండ్రి వైపు వెళ్తున్న లారీ ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఒకదానికొకటి స్వల్పంగా తగిలాయి. దీంతో రెండు వాహనాల డ్రైవర్లు పక్కన ఆపి మాట్లాడుకుంటున్నారు.

అది గమనించిన మరో ట్రావెల్ బస్సు కూడా అక్కడ ఆపారు. ఆ బస్సు డ్రైవర్లు శ్రీనివాస్, బంగారయ్య వచ్చి గొడవ గురించి చర్చించారు. ఇంతలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వస్తున్న లారీ.. అతివేగంతో దూసుకొచ్చి ఆపివున్న లారీని ఢీకొట్టింది. దీంతో నలుగురు వ్యక్తులు రెండు లారీల మధ్య నలిగిపోయారు.

ఈ ఘటనలో రెండో బస్సు డ్రైవర్లు శ్రీనివాస్, బంగారయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మొదటి బస్సు క్లీనర్ సురేశ్ తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ ఘటన ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు డ్రైవర్ల మృతదేహాలను నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. క్షతగాత్రులను చికిత్స కోసం తరలించారు. ఇక మూడు వాహనాలను పోలీసులు స్టేషన్‌కు తరలించి, రహదారిపై ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -