Tuesday, March 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలులాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు

లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశీయ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. చమురు సెగతో నిన్న భారీ నష్టాలను చవిచూసిన సూచీలు.. నేటి ట్రేడింగ్‌లో కోలుకున్నాయి. ఇంధన ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా చమురుపై ఉన్న కొన్ని రకాల ఆంక్షలను తొలగించనున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అలాగే యుద్ధం ముగింపు గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు, కనిష్ఠాల వద్ద కొనుగోళ్లు సెంటిమెంట్‌ను బలపరిచాయి. దాంతో ప్రీఓపెనింగ్ సెషన్‌లో సెన్సెక్స్ 800 పాయింట్లు మేర ఎగబాకింది.

ఉదయం 9.38 గంటల సమయంలో సెన్సెక్స్ 322 పాయింట్ల లాభంతో 77,888 వద్ద ఉండగా.. నిఫ్టీ 91 పాయింట్లు పుంజుకొని, 24,119 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 91.93గా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -