Tuesday, March 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమంత్రి పొంగులేటిని కలిసిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి

మంత్రి పొంగులేటిని కలిసిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి మంగళవారం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో ఆయనకు ఉన్న అనుభవం, నిబద్ధత మరియు అంకితభావం తెలంగాణ గళాన్ని దేశ రాజధానిలో బలంగా వినిపించడానికి ఎంతో దోహదపడతాయని మంత్రి ఆకాంక్షించారు. రాజ్యసభలో ఆయన పార్లమెంటరీ ప్రస్థానం విజయవంతంగా సాగుతూ, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -