Wednesday, March 11, 2026
E-PAPER
Homeఆటలుపిల్లల కోసం రైలులో ఇంటికి వెళ్లిన దూబే

పిల్లల కోసం రైలులో ఇంటికి వెళ్లిన దూబే

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌లో తన హిట్టింగ్‌తో ఆకట్టుకున్న శివమ్‌ దూబె ఫైనల్‌ మ్యాచ్‌ అనంతరం కొన్ని గంటల్లోనే రైలులో ఇంటికి వెళ్లాడు. తన పిల్లలను చూసేందుకు అహ్మదాబాద్‌ నుంచి ముంబయికి సతీమణితో కలిసి ప్రయాణించాడు. ఎవరూ గుర్తుపట్టకుండా టీషర్ట్‌, క్యాప్‌, మాస్క్‌ ధరించాడు. విమానాల్లో బుకింగ్స్‌ లేకపోవడంతో రైలులో ప్రయాణించినట్లు దూబె చెప్పాడు. రైలు బయలుదేరే 5 నిమిషాల ముందు వరకు కారులోనే కూర్చున్నట్లు, వెంటనే రైలు ఎక్కి అప్పర్‌ బెర్త్‌లో పడుకున్నట్లు తెలిపాడు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -