Wednesday, March 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుWar Effect: ప్లాంట్లలో తగ్గిన గ్యాస్ సరఫరా.. రోడ్లపై నిలిచిన ట్యాంకర్లు

War Effect: ప్లాంట్లలో తగ్గిన గ్యాస్ సరఫరా.. రోడ్లపై నిలిచిన ట్యాంకర్లు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: చర్లపల్లిలోని ప్రధాన గ్యాస్ నింపే కేంద్రాల్లో ఇంధన సరఫరా ఒక్కసారిగా కుంటుపడింది. భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్ పీసీఎల్), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) సంస్థల నుంచి ఇంధన సరఫరా దాదాపు 75 శాతం మేర తగ్గిపోవడంతో గ్యాస్ లారీల రాకపోకలు నిలిచిపోయాయి. ముడి చమురు లభ్యత తగ్గడమే ఈ భారీ సరఫరా కోతకు కారణమని విశ్వసనీయ వర్గాల సమాచారం. చర్లపల్లిలోని ఈ మూడు ప్రధాన ప్లాంట్ల నుంచి కేవలం తెలంగాణతో పాటూ పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు కూడా భారీగా చమురు, గ్యాస్ సరఫరా అవుతుంది. తాజాగా సరఫరా తగ్గడంతో ఆయా రాష్ట్రాలకు వెళ్లాల్సిన వాహనాలు ప్లాంట్ల వద్దే బారులు తీరాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -