Wednesday, March 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపశ్చిమాసియాలో ఘర్షణలు..మార్కెట్లలో అనిశ్చితి

పశ్చిమాసియాలో ఘర్షణలు..మార్కెట్లలో అనిశ్చితి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితిని పెంచుతున్నాయి. ఈ ప్రభావం దేశీయ షేర్‌ మార్కెట్‌పైనా స్పష్టంగా కనిపిస్తోంది. బుధవారం ట్రేడింగ్‌లో పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ బలహీనపడడంతో సూచీలు గణనీయంగా పడిపోయాయి.

వెయ్యి పాయింట్లకు క్షీణదశ …
ఒక దశలో సెన్సెక్స్‌ వెయ్యి పాయింట్లకు దగ్గరగా క్షీణించింది. ఉదయం 11:50 గంటల సమయానికి సెన్సెక్స్‌ 943 పాయింట్లు పడిపోయి 77,262 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో నిఫ్టీ 259 పాయింట్లు తగ్గి 24,002 స్థాయిలో కదలాడుతోంది.

నిఫ్టీ సూచీలు …
నిఫ్టీ సూచీలో జియో ఫైనాన్షియల్‌, కోల్‌ ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, సన్‌ ఫార్మా, అదానీ గ్రూప్‌కు చెందిన కొన్ని షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అయితే ఎంఅండ్‌ఎం, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వంటి స్టాక్స్‌ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలు కూడా మదుపర్లను ఆందోళనకు గురిచేశాయి. దీంతో గత సెషన్‌లో వచ్చిన లాభాలను పెట్టుబడిదారులు బుక్‌ చేసుకోవడానికి మొగ్గు చూపారు.

యుద్ధ ప్రభావం ….
పశ్చిమాసియాలో యుద్ధం త్వరలో ముగియవచ్చని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నప్పటికీ, అక్కడ దాడులు మాత్రం కొనసాగుతుండటం మార్కెట్లను ప్రభావితం చేసింది. మరోవైపు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అమ్మకాలు కొనసాగించడం కూడా మార్కెట్‌పై ఒత్తిడిని పెంచింది.

తగ్గని అస్థిరత ….
ముడి చమురు ధరలు మంగళవారం ఒక్క బ్యారెల్‌కు 10 శాతం వరకు తగ్గినా, ప్రపంచ మార్కెట్లలో అస్థిరత ఇంకా తగ్గలేదు. భారత్‌ ముడి చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడటం వల్ల ఈ పరిణామాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్‌ తరువాత ఒక శాతం మేర కుంగిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 91.89 వద్ద నమోదయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -